తండాలు గ్రామపంచాయతీలుగా..ఆ ఘనత కేసీఆర్‌దే

17-09-2026 | 11:02am

మహబూబ్‌నగర్: గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR), మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌(Srinivas Goud) చిత్రపటాలకు లాల్య నాయక్‌ తండా గ్రామపంచాయతీలో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రతాప్‌ నాయక్‌, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్‌, కార్యదర్శి దీక్యా నాయక్‌, మాజీ ఎంపీటీసీ మనోహర్‌ నాయక్‌, వార్డు సభ్యులు హిరి భాయి, సుశీల, భాస్కర్‌ నాయక్‌, బొజ్జ నాయక్‌, రాజు నాయక్‌, సీతారాం నాయక్‌, పాండు నాయక్‌, నూరియా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు