ఓంకారేశ్వర ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ ఓంకారేశ్వర ఆలయం(Omkareshwara Temple)లో వీరశైవ లింగాయత్ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు(Mass Satyanarayana Swamy Vratams) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు అవినాష్ అయ్యగారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ.. లోకకళ్యాణార్థం, కామారెడ్డి పట్టణ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ సామూహిక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ పూజా కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సభ్యులు కంది శివరాములు, జీవన్ దేశాయ్, ఇంద్రశేఖర్, సంగమేశ్వర్, ఆంజనేయులు, పట్నం శ్రీనివాస్, పటేల్ రాజు, చంద్రం, మారుతి, నాగేష్, మల్లికార్జున్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.