పోచారంకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మైనారిటీ సోదరులు..

21-10-2026 | 04:56pm

బాన్సువాడ అక్టోబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy)కి బోర్లం క్యాంప్ గ్రామానికి చెందిన మైనారిటీ సోదరులు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ఆశం, జామ మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ రహత్, కమిటీ సభ్యులు మొహమ్మద్ గౌస్, అల్తాఫ్, జాకీర్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు