కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు
21-10-2026 | 05:01pm
కాగజ్నగర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్(Congress)లో చేరారు. బుధవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విటల్ నివాసంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు సల్ల కొండ భాగ్యలక్ష్మి (శ్రీకాంత్), మాజీ కౌన్సిలర్ ఎల్లేష్ లు కాంగ్రెస్లో చేరగా వారికి ఎమ్మెల్సీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దస్తగిర్, కౌన్సిలర్ లు కచ్చకాయల జ్యోతి, ఏ మ్మాజీ శారద--సంతోష్, రవి, మాజీ కౌన్సిలర్ షబ్బీర్ హుస్సేన్, నాయకులు సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.