ఆపదలో ఉన్న కుటుంబాలకు నెంబర్ వెంకట్ ఆర్థిక సాయం
కల్లూరు, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వమని నిరూపించారు కల్లూరు(Khalluru) శాంతినగర్‌కు చెందిన మాజీ వార్డు సభ్యుడు, సండ్ర వెంకట వీరయ్య అనుచరుడు కొత్తపల్లి వెంకటేశ్వర్లు(నెంబర్ వెంకట్). గోపాలకుంటలో తాపీ పని చేస్తూ ప్రమాదానికి గురై కాళ్లు విరిగి మంచానికే పరిమితమైన ఖమ్మంపాటి నరసింహారావు, గండు సత్యం కుటుంబాలను ఆయన పరామర్శించి, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. తాను కూడా గతంలో ఆరు నెలలు మంచానికే పరిమితమయ్యానని, వారి బాధ తెలుసుకుని సాయం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఖమ్మంపాటి పుల్లారావు, మోదుగు రమేష్, తేలపుట్ట శ్రీనివాసరావు, కొత్తపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.