టీ20లో టీమిండియా ఊచకోత.. 3-0తో క్లీన్ స్వీప్!
రాయ్‌పూర్: జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 92 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ (Clean Sweep) చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది.
భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ 69 పరుగులతో రాణించగా, హర్మన్‌ప్రీత్ కౌర్ 41 బంతుల్లో అజేయంగా 91 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం బౌలింగ్‌లో నందిని శర్మ మూడు వికెట్లు తీసి జింబాబ్వే పరుగుల వేగానికి అడ్డుకట్ట వేసింది. ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని అందుకోలేకపోవడంతో భారత్ 92 పరుగుల తేడాతో విజయాన్ని ఖాయం చేసుకుంది.
ఈ విజయంతో భారత మహిళల జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా, ప్రత్యర్థికి ఒక్క మ్యాచ్ కూడా గెలిచే అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం చాటింది.