వెంకటాపురం రామాలయం వద్ద అన్నదాన కార్యక్రమం
ఎర్రుపాలెం, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా(Khammam district) ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలోని రామాలయం వద్ద దసరా నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ బండారు నరసింహారావు, డిసిసిబి డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ చైర్మన్ వెన్నపూస కృష్ణారెడ్డి,సర్పంచ్ తల్లపురెడ్డి నాగిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, శీలం వెంకట్రామిరెడ్డి, కర్నాటి సుధాకర్ రెడ్డి, వెర్రు వెంకటేశ్వరావు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.