పల్లె ప్రగతికి ఇరవెండి పంచాయతీ ఆదర్శం!
ప్రకృతి వనం, డంపింగ్ షెడ్, కంపోస్ట్ పిట్ల నిర్వహణపై డీపీఓ అనూష ప్రశంసలు
బూర్గంపాడు,(విజయక్రాంతి): గ్రామంలో పచ్చదనం, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణకు ప్రాధాన్యమిస్తూ ఇరవెండి గ్రామపంచాయతీ చేపడుతున్న పనులపై డీపీఓ అనూష(DPO Anusha) ప్రశంసలు కురిపించారు. ఆదివారం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం(Village Nature Park), డంపింగ్ షెడ్, కంపోస్ట్ పిట్లను ఆమె పరిశీలించారు. వాటి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.గ్రామంలో పచ్చదనాన్ని పరిరక్షించడం, చెత్తను సక్రమంగా నిర్వహించడం, జీవ వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువు తయారు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలో పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బాబురావు, ఉపసర్పంచ్ మహంకాళి రామారావు లను అభినందించారు.