అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి
చిట్యాల, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్(BJP State Secretary Tutapalli Ravikumar) పిలుపునిచ్చారు. సోమవారం చిట్యాల పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తుటపల్లి రవికుమార్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ, మండల అధ్యక్షుడు పీకే వెంకన్న, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ కన్నబోయిన శ్రీధర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, బీజేపీ సీనియర్ నాయకులు ఘోషక వెంకటేశం, కంచర్ల శంకర్ రెడ్డి, విడుదల మల్లేష్, బీజేవైఎం చిట్యాల పట్టణ అధ్యక్షుడు వైరాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు.