ప్రజావాణికి మూడు ఫిర్యాదులు
26-10-2026 | 09:56pm
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండల పరిషత్ కార్యాలయం(Mandal Parishad Office)లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మూడు ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో గంగాధర్(MPDO Gangadhar) తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకట్రెడ్డి, ఎంపీవో ప్రభాకర్చారి, మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్, ఏపీవో సక్కుబాయితో పాటు పలువురు మండల అధికారులు పాల్గొన్నారు.