ప్రజా సౌకర్యాలే ధ్యేయం
- రూ. పది లక్షలతో నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
- ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
కామారెడ్డి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ(Kamareddy town) అభివృద్ధిలో భాగంగా 46వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ(Mohammed Shabbir Ali) ప్రారంభించారు. స్థానిక కౌన్సిలర్ గేరిగంటి లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్యతో కలిసి ఆయన పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా వార్డుల్లో రహదారుల అభివృద్ధికి(Road Development) ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు(Improved infrastructure) కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నూతన సీసీ రోడ్ల నిర్మాణంతో(Construction of CC roads) స్థానిక ప్రజలకు రాకపోకల్లో సౌకర్యం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, కౌన్సిలర్లు అన్వార్, షేరు, సత్యం, సిద్దిక్, అంజాద్, యూనుస్, చిట్టిబాబు, గంగాధర్, కౌన్సిలర్లు లోలం శ్రీనివాస్, మామిండ్ల లక్ష్మణ్, మన్సూర్, గేరిగంటి స్వప్న, కౌన్సిలర్ పిట్ల వేణు గోపాల్, ఏజాజ్, కామారెడ్డి విండో చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి,
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజగౌడ్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు భూమని బాలరాజు, అనుమాల రాము కుమార్, విండో చైర్మన్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, మాజీ కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య, నరేందర్ రెడ్డి, గొనె శ్రీనివాస్, ముబషీర్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.