అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోండి
రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ కు.. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు గులాం అహ్మద్ వినతి
కరీంనగర్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో(Karimnagar District) అన్యాక్రాంతమైన వందలాది ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను(Waqf Board lands) గుర్తించి స్వాధీనం చేసుకోవాలని, ఉమ్మడి జిల్లాలలో ముస్లిం మైనారిటీలు(Muslim minorities) ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ.. ఎంఐఎం కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్(Syed Ghulam Ahmed Hussain) రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin) ను శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
వక్ఫ్ బోర్డు చైర్మన్ తో కలిసి, కరీంనగర్ కు రండి, కబ్జాకు గురైన వక్ఫ్ భూములను మేము చూపిస్తామని చెప్పారు. ప్రతి 6 నెలలకు ఒకసారి మైనారిటీ సంక్షేమ పథకాల అమలుపై, కలెక్టర్ అధ్యక్షతన రివ్యూ మీటింగ్ నిర్వహించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవలే కరీంనగర్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసినట్లు మంత్రి అజారుద్దీన్ కు గులాం అహ్మద్ తెలిపారు.