తుడుందెబ్బ మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక
కన్నాయిగూడెం,అక్టోబర్ 10(విజయక్రాంతి) : ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలం తుడుందెబ్బ మండల కమిటీని(Tudum Debba Mandal Committee) శనివారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ముఖ్య అతిధిగా తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ హాజరయ్యారు.మైపతి అరుణ్ కుమార్ కు ఆదివాసీ మహిళలు మంగళహరతులతో, పూల మాలలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీల ఐక్యతే ఆదివాసుల బలమని, ఆదివాసుల హక్కుల(Indigenous rights) కొరకే తుడుందెబ్బ పుట్టిందని అన్నారు.మండలం అడ్వైజర్లుగా ఆలం సంతోష్, పీర్ల శ్రీను, పీర్ల కేశవరావు, అల్లెం ప్రభాకర్, గౌరవ అధ్యక్షులుగా డబ్బాగట్ల శ్రీను, చేర్ప సమ్మయ్యలను నియమించారు.
తుడుందెబ్బ మండల అధ్యక్షులుగా గుండ్ల పాపారావు, ప్రధాన కార్యదర్శిగా చర్ప పగడయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కంటెం రాఘవులు, ఆలం నాగేశ్వరావు, సహాయకార్యదర్శిగా కోరం సంపత్, ఆలం జంపయ్యలను ఎన్నుకున్నారు..ఈ కార్యక్రమంలో ఆదివాసీ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...