పోలీస్ ఫ్లాగ్ డే పోటీల్లో యువత, విద్యార్థులు పాల్గొనాలి
- సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేట క్రైం, అక్టోబర్ 10 (విజయక్రాంతి): పోలీస్ ఫ్లాగ్ డే(Police Flag Day)–2026 సందర్భంగా నిర్వహిస్తున్న వ్యాసరచన(Essay Writing), షార్ట్ ఫిల్మ్(Short film), ఫోటోగ్రఫీ పోటీల్లో(Photography Competition) విద్యార్థులు, యువత, పోలీస్ సిబ్బంది పాల్గొనాలని సీపీ రష్మీ పెరుమాళ్(CP Rashmi Perumal) కోరారు. పోలీసుల సేవలు, త్యాగాలు, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించడమే పోటీల లక్ష్యమని తెలిపారు. 12వ తరగతి వరకు, డిగ్రీ, ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పోలీస్ శాఖకు సంబంధించిన అంశాలపై తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో గరిష్ఠంగా మూడు నిమిషాల నిడివితో షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించవచ్చన్నారు. ఉత్తమ మూడు షార్ట్ ఫిల్మ్‌లు, ఫోటోగ్రఫీలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు, ఎంపికైన వారికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు.