కరెంటు కష్టాలు.. రైతుల కన్నీళ్లు

10-10-2026 | 08:15pm

గొండ్రియాలలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి అన్నదాతల ఆందోళన

కోదాడ (అనంతగిరి)( విజయ క్రాంతి)అక్టోబర్ 10: వ్యవసాయానికి(Agriculture) సరిపడా విద్యుత్‌ సరఫరా(Power supply) లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు(Farmers) ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా(Suryapet District) అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆందోళనకు దిగారు. మరోవైపు ఎండిన పొలాల్లో(Parched fields) బైకులు నడుపుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. వ్యవసాయానికి రోజుకు 12 గంటల నిరంతర త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా(Three-phase power supply) చేయాలని డిమాండ్‌ చేశారు.

గొండ్రియాలలో రోజుకు 3–4 గంటలు కూడా సక్రమంగా విద్యుత్‌ సరఫరా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన కరెంటు సైతం లోవోల్టేజీతో ఉండటంతో మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. నీరందక పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయని తెలిపారు. లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, తీరా పంట చేతికందే సమయంలో విద్యుత్‌ కోతలు తమను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని కన్నీరుమున్నీరయ్యారు.

ఎన్నికల సమయంలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు విమర్శించారు. విద్యుత్‌ కోతలపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలతోపాటు రైతుల జీవితాలు కూడా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్య పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం

విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వ్యవసాయానికి 12 గంటల నిరంతర త్రీ ఫేజ్‌ విద్యుత్‌ అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేపడతామని, రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు