నాలుగు బంగారు పతకాల విజేతకు సన్మానం
బూర్గంపాడు,(విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో పీజీ పూర్తి చేసి నాలుగు బంగారు పతకాలు సాధించిన మేఘన కాంతి ప్రియను సారపాకలోని సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయ(Saketapuri Dasanjaneya Swamy Temple) కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. మహాలయ అమావాస్య సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం మేఘనను, ఆమె తల్లిదండ్రులు గోవిందరెడ్డి, ధనలక్ష్మిని అభినందించారు. నాలుగు బంగారు పతకాలు సాధించడం సారపాక ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని మేఘన తెలిపారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ సాధించి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఏనుగుల వెంకట్‌రెడ్డి, బీఎంఎస్ ప్రతినిధి వారాల కనకారావు, సోము రోసిరెడ్డి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.