పార్టీలకతీతంగా దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, అక్టోబర్ 17 (విజయక్రాంతి): దసరా ఉత్సవాలలో(Dussehra celebrations) పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) కోరారు. శనివారం కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో(Indira Gandhi Stadium, Kamareddy) దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ ఉత్సవాలను కులమతాలకు, రాజకీయ పార్టీలకు(political parties) అతీతంగా ప్రజలందరూ కలిసి జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు పంపించి ఉత్సవాలకు ఆహ్వానించనున్నట్లు తెలిపారు.అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, క్రీడలు, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్, ట్రాఫిక్ తదితర శాఖల అధికారులతో షబ్బీర్ అలీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీటి సదుపాయం, భద్రతా ఏర్పాట్లు, మరుగుదొడ్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.కామారెడ్డి పట్టణంలో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, బాంబే క్లాత్ యజమాని రాజకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.