బంజారా తండా బడిలో బతుకమ్మ వేడుకలు

08-10-2026 | 04:41pm

ఉత్సాహంగా బతుకమ్మ ఆడి,పాడి సందడి చేసిన విద్యార్థులు...

సదాశివనగర్,అక్టోబర్ 08(విజయక్రాంతి):తెలంగాణ సంస్కృతికి(Telangana Culture) ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ సంబురాలు(Bathukamma Celebrations) ప్రజలు,విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపాలని సర్పంచ్ సంధ్యవిజయ్ కుమార్ ఆకాంక్షించారు.సదాశివనగర్ మండలం వజ్జెపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేసి గౌరమ్మ పూజలు చేశారు.బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు.అంగన్వాడీ ఉపాధ్యాయులతో పాటు బాలికలు కలిసి పాఠశాలల ఆవరణలో బతుకమ్మ ఆడారు.

గిరిజన సాంప్రదాయ పాటలకు అనుగుణంగా దాండియా ఆడి బతుకమ్మను నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీజ,ఉపాధ్యాయులు అజయ్,ప్రవీణ్,అంగన్వాడీ టీచర్లు జ్యోతి,మంజుల,సహాయకురాలు సావిత్రి,బంజారా మహిళలు ఉన్నారు.

మరిన్ని వార్తలు