పరుగు పందెంలో ప్రథమ స్థానంలో తాడ్వాయి విద్యార్థిని..

25-11-2026 | 08:06pm

తాడ్వాయి, నవంబర్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్(Kamareddy Athletics) ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగు పందెం పోటీల్లో తాడువాయి విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సురేఖ తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం బైపిసి విద్యార్థిని సమీక్ష 1600 మీటర్ల పరుగు పందెంలో జిల్లాలోనే టాపరుగా నిలిచినట్లు ఆమె తెలిపారు.

బైపిసి మొదటి సంవత్సరం విద్యార్థిని కవిత 400 మీటర్ల పరుగు పందెంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. 80 మీటర్ల పరుగు పందెంలో మొదటి సంవత్సరం బైపిసి విద్యార్థిని అక్షర మూడో స్థానంలో, డిస్కస్ త్రోలో రిషిత, లాంగ్ జంప్ లో కృష్ణవేణి మూడో స్థానంలో,600 మీటర్ల పరుగు పందెంలో చరిత రెండవ స్థానంలో నిలిచినట్లు ఆమె వివరించారు. పరుగు పందెంలో సమీక్ష, కవితలు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు