ట్రాఫిక్ అంతరాయం లేకుండా దుకాణాలు ఉండాలి
సీఎం పర్యటన నేపథ్యంలో టౌన్ ప్లానర్ సూచన
అచ్చంపేట నవంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అచ్చంపేట పర్యటన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. అచ్చంపేటలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చిరు దుకాణదారులకు సూచనలు అందించారు. సీఎం రాక సందర్భంగా దుకాణాలను ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారి మనోజ సూచించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి రహదారి వెంబడి తిరిగి దుకానాదారులకు ఆదేశాలు తెలియజేశారు. రోడ్డుపై దుకాణాలు ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని హెచ్చరించారు. చిరు వ్యాపారులు తమ దుకాణాలను ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలని సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో సహకరించాలని ఆదేశించారు. ఆమె వెంట మునిసిపల్ సిబ్బంది ఉన్నారు.