మేడ్చల్ డిపోలో ‘డయల్ యువర్ డీఎం’
* మధ్యాహ్నం 12 నుండి ఒంటి గంట వరకు ప్రయాణికుల నుండి ఫోన్ల స్వీకరణ...
* 9959226152 నంబర్‌కు కాల్ చేసి బస్సు సమస్యలను తెలియజేయవచ్చు
డిపో మేనేజర్ పరిమళ వెల్లడి..
మేడ్చల్ నవంబర్ 25 (విజయక్రాంతి): ప్రయాణికులకు మెరుగైన ఆర్టీసీ సేవలు అందించే లక్ష్యంతో మేడ్చల్(Medchal) డిపో పరిధిలో గురువారం రోజు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ పరిమళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మధ్యాహ్నం 12:00 గంటల నుండి ఒంటి గంట (13:00) వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
మేడ్చల్ పరిసర ప్రాంతాల ప్రజలు, నిత్యం ప్రయాణించే వారు ఆర్టీసీ బస్సుల రాకపోకల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, బస్సు సౌకర్యాలు, ఇతర సమస్యలను 9959226152 నంబర్‌కు ఫోన్ చేసి నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ప్రయాణికుల నుండి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ పరిమళ కోరారు.