ప్రజావాణి కి రెండు ఫిర్యాదులు...
02-11-2026 | 07:35pm
తాడ్వాయి,నవంబర్,02( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో(Council Office) సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రెండు ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో భరత్ కుమార్(MPDO Bharat Kumar) తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ప్రజలు అన్ని రకాల సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.