తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
కరీంనగర్ సిటీ సెప్టెంబర్29 (విజయ క్రాంతి): తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం(Telangana SC/ST Teachers' Association) ఘన సన్మానం ఎస్. జి .ఎఫ్ సెక్రెటరీ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లకు తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఘన సన్మానం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్. జి .ఎఫ్ సెక్రటరీగా ఇటీవలే నియామకమైన ఎల్. బన్సీలాల్ కు మరియు ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ గా నియామకం అయిన రామడుగు రవీందర్ లను ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.
కరీంనగర్లోని ఫిలిం భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలోతెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గా నియమితులైన రామడుగు రవీందర్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ గా నియమితులైన బన్సీలాల్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు సమర్థవంతంగా, పారదర్శకంగా పనిచేసి వారు నియామకమైన పదవులకు వన్నె తేవాలని అభిలాషించారు. జిల్లా అధ్యక్షులు మీసాల మల్లిక్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుటకుతెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కృషి చేస్తుందని అన్నారు.
విద్య,ఆట పాటలలో ప్రతిభగల ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించి మంచి అవకాశాలు కల్పించే విధంగా తోడ్పడాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవెల్లి తిరుపతి,జిల్లా ప్రధాన కార్యదర్శి రవి నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న, ఉపాధ్యక్షులు నాయక్, నర్సింగం,శంకర్, కనకం సమ్మయ్య, వంతడుపుల శ్రీనివాస్ గన్నేరువరం మండల విద్యాధికారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.