డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు చివరి అవకాశం
28-09-2026 | 05:12pm
ముకరంపుర, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల(SRR Government Degree College) కరీంనగర్ లో వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం వన్ టైమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్లను సెప్టెంబర్ 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రామకృష్ణ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు నేరుగా కళాశాలలో జరిగే స్పాట్ అడ్మిషన్లలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ప్రవేశం పొందు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తించదని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఇది చివరి అవకాశం అని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రామకృష్ణ సూచించారు.