కడ్పల్ గ్రామంలో VB-GRAM-G పథకం కింద ఫారం పాండ్ పనులు

28-09-2026 | 05:01pm

సిర్గాపూర్ సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో VB-GRAM-G పథకం కింద జుంపాలా శాంతమ్మ చేనులో సోమవారం ఫారం పాండ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు చేపట్టారు.

ఫారం పాండ్ పనులు పడ్డ వర్షపు నీటిని పొలాల్లో నిల్వ చేయడంతో పాటు భూగర్భ జలాల పెంపు, వ్యవసాయానికి నీటి లభ్యత మెరుగుపడేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రైతులకు నీటి వనరుల అభివృద్ధికి దోహదపడతాయని APO నర్సిములు అన్నారు. ఈ కార్యక్రమంలో TA కృష్ణ, పంచాయతీ కార్యదర్శి రవీందర్ రెడ్డి, సర్పంచ్ ఎం.విమల విట్టల్ రెడ్డి, FA వెంకట్ రాములు, వార్డు మెంబర్ పి.బస్వానప్ప, ఎం.సంతోష్, రైతులు పాలొగొన్నారు.

మరిన్ని వార్తలు