యువతకు కొండా లక్ష్మణ్ ఆశయాలే శ్రీరామరక్ష
నంగునూరు, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): తెలంగాణ ఆత్మగౌరవం(Telangana Self-Respect), హక్కుల కోసం బాపూజీ సాగించిన పోరాటం నేటి తరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) స్ఫూర్తిదాయకమనీ ఎఎంసి వైస్ చైర్మన్ సాధుల పవన్ కుమార్(AMC Vice Chairman Sadhula Pavan Kumar) అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నంగునూరు మండల కేంద్రంలో పద్మశాలి సంఘం(Padmashali Association) ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన పోరాటం నేటి తరానికి మరువలేనిదని పేర్కొన్నారు.
యువత విద్య, ఉపాధి రంగాల్లో(Youth education and employment sector) రాణిస్తూ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పద్మశాలి సంఘం అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దాసరి రామలింగం, సాదుల చంద్రశేఖర్, దాసరి రవి, కారపురి శ్రీనివాస్, బింగి రవీందర్, బొజ్జ మహేష్, ఆనందాస్ విష్ణుమూర్తి,దాసరి మల్లేశం, కారంపూరి రామచంద్రం, ఆరగొండ శశి, పోతన వినోద్, దికొండ భాను, దాసరి వినయ్, దాసరి శేఖర్, వేముల ప్రశాంత్, గాజర్ల సిద్దు, దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.