ప్యానల్ సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి
ఆర్ వి ఆర్ ఆర్ పరిషత్ ప్యానల్ అధ్యక్ష అభ్యర్థి కసిరెడ్డి రాణి రెడ్డి
మానకొండూరు, నవంబర్ 26 (విజయక్రాంతి): బహుదూర్ వెంకటరామిరెడ్డి(Bahadur Venkatarami Reddy) (ఆర్ వి ఆర్ ఆర్) విజ్ఞాన పరిషత్ కు జరగనున్నఎన్నికల్లో, ప్యానల్ సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని , ప్యానెల్ తరఫున అధ్యక్షురాలి స్థానానికి బరిలో ఉన్న కసిరెడ్డి రాణి రెడ్డి కోరారు. సంఘ సభ్యుల సంక్షేమం కోసం నిరంతరంకృషి చేస్తామని చెప్పారు.మానకొండూర్ మండలంలోని సదాశివపల్లి గ్రామంలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ కు జరగనున్న ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ చేస్తున్న కసిరెడ్డి రాణిరెడ్డి, ప్యానెల్ సభ్యులు గురువారం జోరుగా ప్రచారం నిర్వహించారు.
అత్యధిక మెజారిటీతో గెలిపించి సేవ చేసే భాగ్యం కల్పించాలని, ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గా పోటీ చేస్తున్న కసిరెడ్డి రాణిరెడ్డి, కార్యదర్శిగా పోటీ చేస్తున్న నరహరి లక్ష్మారెడ్డి , కోశాధికారిగా పోటీ చేస్తున్న ఎడమ జగన్ మోహన్ రెడ్డి, ప్యానెల్ సభ్యులు కూర మహిపాల్ రెడ్డి , చింతల శ్రీనివాస్ రెడ్డి , సంగీత రెడ్డి , గుడిపాటి రమణారెడ్డి ,చంద్రశేఖర్ రెడ్డి ,మర్రి రాజిరెడ్డి ,వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ అధ్యక్షులు పెండ్యాల రాంరెడ్డి , రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి ,కరీంనగర్ జిల్లా రెడ్డి జేఏసీ అధ్యక్షులు ఏనుగు చుక్కారెడ్డి, గ్రామరెడ్డి సంఘం సభ్యులందరు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.