కారేపల్లిలో భట్టీ, సీపీ దిష్టిబొమ్మల దహనం

30-10-2026 | 11:16pm

సింగరేణి,(విజయక్రాంతి):  సీపీఐ(ఎం)(CPI(M)) సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు హత్య చేసిన నిందితులను వదిలి కేసును పక్కదారి పట్టిస్తున్న తీరుకు నిరసనగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం కారేపల్లిలో  ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), ఖమ్మం సీపీ ల దిష్టిబొమ్మలను సిపిఎం సింగరేణి మండల కమిటీ(CPM Singareni Mandal Committee) ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లాకమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్రలు మాట్లాడుతూ  ఖమ్మం జిల్లా ఉప ముఖ్యమంత్రి హోదలో మల్లు భట్టి విక్రమార్క  హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. భట్టి డైరక్షన్ లో సీపీ నడుచుకుంటూ దాబేదారుగా మారారని విమర్శించారు. 

ఉద్యమాల గుమ్మం చైతన్యవంతమైన ప్రజలు ఉన్న ఖమ్మం జిల్లాలో పోలీసు వ్యవస్థకు తలవొంపులు తెచ్చే విధంగా సీపీ వ్యవహారశైలీ ఉందన్నారు. సామినేని రామారావు హత్యకేసులో సంబంధం లేని వారిని అరెస్టు చేసి కేసు పక్కదోవపట్టిస్తున్నారన్నారు. హత్య కేసు సిట్ ద్వారా విచారణ జరిపించి దోషులను శిక్షించాలని, భట్టిని మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేయాలని, సీపీని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. రామారావు హత్య కేసులో అసలైన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని లేని యెడల ఉద్యమాలను ఉదృతం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలను ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముక్క సీతారాములు,  రేగళ్ల మంగయ్య,  ముండ్ల ఏకాంబరం,  శ్రీరాములు, తిరపయ్య,  సైదులు,  కోటయ్య, సంపత్, మంద శ్రీను, తగర బాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు