శాసన మండలిలో పట్టభద్రుల గొంతుకగా బిఆర్ఎస్
మంగపేటలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సమీక్షా సమావేశం
కన్నాయిగూడెం/మంగపేట,(విజయక్రాంతి): తెలంగాణ సమాజంలో విద్యాధికులు, పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయుల హక్కుల సాధనకు, వారి సమస్యల పరిష్కారానికి బిఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓటర్ల ఎన్రోల్మెంట్ ఇన్చార్జ్ శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు స్పష్టం చేశారు.ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు మంగపేట మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియపై సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది.
సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఓటు హక్కు - ప్రజాస్వామ్య ఆయుధం అని రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత కీలకమైనవని, సమాజంలో చైతన్యవంతమైన పట్టభద్రులు సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి ఒక్క అర్హుడైన డిగ్రీ హోల్డర్, గ్రాడ్యుయేట్‌ను ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేయించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమస్యల పోరాటానికి ఎమ్మెల్సీ వేదిక
పట్టభద్రులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన మండలి (ఎమ్మెల్సీ) వేదికగా గట్టిగా వినిపించే సత్తా బిఆర్ఎస్ అభ్యర్థులకే ఉందన్నారు.అనంతరం జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదును పార్టీ శ్రేణులంతా ఒక ఉద్యమంలా చేపట్టాలని కోరారు ప్రణాళికాబద్ధంగా ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారి వివరాలు సేకరించి, నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.అనంతరం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి బడే నాగజ్యోతి మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటు నమోదుపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
మంగపేట మండలంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి, అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్‌తో ఫారమ్-18 పూర్తి చేయించి, ఓటు హక్కు నమోదు చేయించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పోరిక గోవింద్ నాయక్, తాటి కృష్ణ, కాకులమర్రి ప్రదీప్ రావు, తుమ్మ మల్లారెడ్డి, కుడుములు లక్ష్మీనారాయణ, యూనిస్, కొమరం ధనలక్ష్మి, కాడబోయిన నరేందర్, నూతనకంటి ముకుందం, కుర్బాన్ అలీ, బాడిషా, నాగ రమేష్, చిట్టి మల్ల సమ్మయ్య, తుక్కాని శ్రీనివాస్, నూనె లింగయ్య, వివిధ గ్రామ కమిటీ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు._