అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుకు ఆర్థిక సాయం
31-10-2026 | 12:07am
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): విధి నిర్వహణలో ప్రమాదానికి గురై కాలర్‌బోన్, పక్కటెముకల ఫ్రాక్చర్లతో బాధపడుతున్న మీడియా టుడే స్టాఫ్ రిపోర్టర్ ఖాజా మైనుద్దీన్(Media Today staff reporter Khaja Mainuddin)కు పాలమూరు జర్నలిస్టు సంక్షేమ సంఘం తరఫున ఆర్థిక సాయం అందించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) ఈ సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ వాకిట, కార్యదర్శి మల్లు మధుసూదన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు అబ్దుల్ రఫీ జఖి తదితరులు పాల్గొన్నారు.