మాజీ ఎంపీపీ కొండ శంకర్ దంపతులకు ఘన సన్మానం

11-10-2026 | 09:40pm

 చైర్మన్ కావటి రవి కుమార్ యాదవ్

శ్రీ పర్వతాలు మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టం

మంథని అక్టోబర్ 11 (విజయక్రాంతి): మంథని మాజీ ఎంపీపీ కొండ శంకర్(Manthani former MPP Konda Shankar), విలోచవరం మాజీ సర్పంచ్ కొండ విజయలక్ష్మి దంపతులను శ్రీ పర్వతాలు మల్లికార్జున స్వామి దేవస్థాన(Sri Parvatalu Mallikarjuna Swamy Temple) నూతన చైర్మన్ కావటి రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విలోచవరం గ్రామంలోని దేవస్థాన నూతన పాలకమండలి సభ్యులు శాలువాలు కప్పి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ కావటి రవి కుమ్మరి యాదవ్ మాట్లాడుతూ, శ్రీ పర్వతాలు మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేవుని ఆశీర్వాదాలతో ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పాలకమండలి సభ్యుల సహకారంతో కృషి చేస్తామని తెలిపారు.

దేవుని సేవ చేయడం, భక్తులకు సేవలందించడం ఎంతో పవిత్రమైన విషయమని చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన నూతన చైర్మన్ తో పాటు పాలకమండలి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు