ఢిల్లీకి కూసుమంచి కాంగ్రెస్ నాయకులు

01-11-2026 | 09:46am

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ ధర్నాకు మద్దతుగా హాజరు

ఖమ్మం, కూసుమంచి, నవంబర్ 1(విజయక్రాంతి): ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ ధర్నా, ర్యాలీకి మద్దతుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు వెళ్ళారు. ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, మాలోతు రాందాసు నాయక్, కోరాం కనకయ్య, జారే ఆదినారాయణ, మట్టా రాఘమయి దయానంద్, తెల్లం వెంకట్రావు, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, వివిధ శాఖల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్ బాబు, జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, స్వర్ణకుమారి, అన్ని మండలాల అధ్యక్షులు ఢిల్లీ చేరుకున్నారు. "ఓట్ బచావో.. దేశ్ బచావో" నినాదంతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ, ఓటు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు పార్టీ పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు