బీర సాగులో భాస్కర్ భళా!

01-11-2026 | 05:40am

డ్రిప్, మల్చింగ్, ట్రెల్లిస్ విధానాలతో వినూత్న సాగు-20 టన్నుల దిగుబడితో రూ.4 లక్షల ఆదాయం

సొంత వాహనంలో వరంగల్ మార్కెట్‌కు తరలింపు

సూర్యాపేట, అక్టోబర్ 31 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి ఎక్స్ రోడ్డుకు చెందిన రైతు గుగులోత్ భాస్కర్ సంప్రదాయ పంటలకు భిన్నంగా ఆలోచించి కేవలం 1.50 ఎకరాల్లో బీర సాగు(Ridge Gourd Cultivation) చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, ట్రెల్లిస్ (తీగల పందిరి) ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ తక్కువ నీటితోనే సుమారు 20 టన్నుల దిగుబడి సాధించారు.

ఈ పంట ద్వారా ఇప్పటివరకు రూ.4 లక్షల ఆదాయం రాగా, రూ.1.60 లక్షల ఖర్చులు పోను నికరంగా రూ.2.40 లక్షల లాభం ఆర్జించారు. అంతేకాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తన సొంత వాహనంలోనే నేరుగా వరంగల్ మార్కెట్‌కు సరుకు తీసుకెళ్లి విక్రయిస్తూ రవాణా ఖర్చులు తగ్గించుకుంటున్నారు. ఎన్ నినోను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో వరి సాగుతో పోలిస్తే కూరగాయల సాగు మేలని, మంచి లాభాలు పొందవచ్చని రైతు భాస్కర్ చెబుతున్నాడు. 

మరిన్ని వార్తలు