48 ఏళ్లుగా నీళ్లకు దూరం
నీళ్లకు బదులు చెర్రీ కోక్‌నే తాగుతారట.. 96 ఏళ్ల బఫెట్ సీక్రెట్ వైరల్!
వాషింగ్టన్: ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, బిలియనీర్ వారెన్ బఫెట్ వ్యక్తిగత అలవాట్లకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 96 ఏళ్ల వయసులోనూ తనదైన Lifestyleతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బఫెట్.. గత 48 ఏళ్లుగా సాధారణ నీళ్లు తాగడం లేదని చెప్పినట్లు మరో బిలియనీర్, ప్రముఖ Hedge Fund Manager బిల్ అక్‌మన్ వెల్లడించారు. దాహం వేసినప్పుడు తనకు ఇష్టమైన చెర్రీ కోక్ (Cherry Coke) నే ఎంచుకుంటారని ఆయన వివరించారు. ఈ విషయాన్ని Equity Mates Investing Podcastలో అక్‌మన్ పంచుకోవడంతో ఈ కథనం మరోసారి వార్తల్లో నిలిచింది.
కొన్నేళ్ల క్రితం వారెన్ బఫెట్ తన ఇంటికి Dinnerకు వచ్చిన సందర్భాన్ని అక్‌మన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో బఫెట్‌కు సాధారణ నీళ్లు లేదా Sparkling Water కావాలా అని అడిగితే, ఆయన వద్దని చెప్పి చెర్రీ కోక్ కావాలని కోరినట్లు తెలిపారు. అసలు నీళ్లు తాగరా అని ప్రశ్నించగా, దాదాపు 48 ఏళ్లుగా నీళ్లు తాగడం లేదని బఫెట్ సమాధానమిచ్చినట్లు అక్‌మన్ చెప్పారు. దీంతో ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఇంట్లో Cherry Coke అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
బఫెట్‌కు కోకాకోలాపై ఉన్న అభిమానం ఇప్పటిది కాదు. 2015లో Fortune Magazineకు ఇచ్చిన Interviewలో తన రోజువారీ ఆహారంలో కోకాకోలాకు పెద్ద వాటా ఉంటుందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. రోజుకు సుమారు 2,700 Calories తీసుకుంటే, అందులో దాదాపు నాలుగో వంతు కోకాకోలా నుంచే వస్తుందని చెప్పారు. రోజుకు కనీసం ఐదు 12-ounce Servings తాగుతానని, సాధారణంగా పగటిపూట మూడు, రాత్రి రెండు క్యాన్లు తీసుకుంటానని వివరించారు. ఆఫీసులో Regular Coke, ఇంట్లో Cherry Cokeను ఆస్వాదిస్తానని కూడా గతంలో వెల్లడించారు.
అయితే బఫెట్ మొదటి నుంచీ కోకాకోలా అభిమాని కాదు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయనకు పెప్సీ అంటేనే ఇష్టం. ఈ కారణంగా ఆయన కుమారుడు హోవార్డ్ స్నేహితులు సరదాగా ‘Pepsi Warren’ అని పిలిచేవారట. కానీ 1986లో జరిగిన Berkshire Hathaway Annual Meeting సందర్భంగా ఆయన తన పానీయాల ఎంపికను మార్చుకున్నారు. ఆ సమావేశానికి Cherry Cokeను అధికారిక పానీయంగా ప్రకటించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి చెర్రీ కోక్ ఆయనకు ఇష్టమైన పానీయంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, బఫెట్‌కు Coca-Cola పట్ల ఉన్న వ్యక్తిగత అభిమానం ఆయన పెట్టుబడుల విషయంలోనూ కనిపిస్తుంది. ఆయన సంస్థ Berkshire Hathawayకు కోకాకోలాలో గణనీయమైన వాటా ఉంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల వ్యూహాలతో గుర్తింపు పొందిన బఫెట్, మరోవైపు తన ప్రత్యేకమైన Food Habits, Beverage Choicesతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఆయన వ్యక్తిగత అలవాట్లను అందరూ అనుసరించాల్సిన ఆరోగ్య సూత్రాలుగా భావించకూడదు.