ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్ గురి
వారం రోజుల్లో వంద శాతం లక్ష్యం.!
ప్రతి గడపకూ వెళ్లి ఓటర్లను చైతన్యపరచాలి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ గెలుపే లక్ష్యం
బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వరరావు పిలుపు
మోతె, నవంబర్ 01 (విజయక్రాంతి): పట్టభద్రుల ఓటరు నమోదును వారం రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. శనివారం మోతె మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్‌లో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి సమీక్షించారు. ప్రతి గడపకూ వెళ్లి పట్టభద్రులను చైతన్యపరచాలని, నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూక్యా గాంధీ, కారింగుల కమలాకర్‌గౌడ్, మండవ రాము, తదితరులు పాల్గొన్నారు.