కూసుమంచిలో ట్రాక్టర్ - బైక్ ఢీ.. ఒకరి మృతి

15-09-2026 | 10:00am

బాలికకు తీవ్ర గాయాలు..పండుగ పూట విషాదం

కూసుమంచి, విజయక్రాంతి: పండుగ పూట కూసుమంచి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్‌, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, బైక్‌పై ఉన్న బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం కూసుమంచి మండల కేంద్రంలోని పాత పోస్టాఫీస్‌(Old Post Office) సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన చట్టు శ్రీను(40) బైక్‌పై వెళ్తుండగా పాత పోస్టాఫీస్‌ సమీపంలో ట్రాక్టర్‌ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో శ్రీను తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. ఆయనతో పాటు బైక్‌పై ఉన్న చిన్న కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న కూసుమంచి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు శ్రీనుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీను మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు