హర్మూజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్ పేలుడు

15-09-2026 | 09:19am

హర్మూజ్ జలసంధిలో భారీ ఆయిల్ ట్యాంకర్(Oil tanker) నౌకా మైన్లను ఢీకొని పేలిపోయినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ ప్రకటించింది. ‘ఎల్ గియా’ అనే సూపర్ ఆయిల్ ట్యాంకర్ నిషేధిత మార్గంలో ప్రయాణించడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపింది.

మైన్లను ఢీకొన్న వెంటనే నౌకలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయని వెల్లడించింది. మంటలను అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంది. హర్మూజ్ జలసంధి తమ పూర్తి నియంత్రణలో ఉందని, నిషేధిత మార్గాల్లో ప్రయాణించే నౌకలకు ప్రమాదం తప్పదని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. ఈ ఘటనతో జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు