హెల్మెట్‌తోనే ప్రాణ రక్షణ

14-09-2026 | 04:10am

ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే ఎక్కువ

నాణ్యమైన హెల్మెట్‌తో పాటు క్లిప్ తప్పనిసరి

హత్నూర, సెప్టెంబర్ 13: రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు(Two-Wheeler Riders) తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా హెల్మెట్(Helmet) ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దౌల్తాబాద్ నుంచి సంగారెడ్డి, తూప్రాన్, జోగిపేట వైపు వెళ్లే ప్రధాన రహదారులతో పాటు ఇతర మార్గాల్లోనూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది.

చాలామంది తక్కువ దూరమే కదా.. హెల్మెట్ ఎందుకంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు హెల్మెట్ బరువుగా ఉంటుందని, జుట్టు రాలుతుందని వంటి కారణాలు చెబుతూ నిబంధనలను పాటించడం లేదు. అయితే ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో చెప్పలేని పరిస్థితుల్లో హెల్మెట్ ధరించడం నిబంధన కంటే ముందుగా ప్రాణ రక్షణకు తీసుకునే కనీస జాగ్రత్తగా భావించాలి.

నాణ్యమైన హెల్మెట్ తప్పనిసరి

హెల్మెట్ ధరించడం మాత్రమే కాకుండా నాణ్యత కలిగిన హెల్మెట్ను ఎంచుకోవడం కూడా కీలకం. సంబంధిత బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న హెల్మెట్నే వినియోగించాలి. హెల్మ్పె ఉన్న ఐఎస్‌ఐ గుర్తు, లైసెన్స్ వివరాలను పరిశీలించి కొనుగోలు చేయాలి. కేవలం చలాన్ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో నాసిరకం హెల్మెట్లను కొనుగోలు చేయకుండా, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

హెల్మెట్ క్లిప్ పెట్టుకోకపోతే ప్రయోజనం తగ్గుతుంది

హెల్మెట్ ధరించినంత మాత్రాన భద్రత పూర్తికాదు. ప్రయాణ సమయంలో హెల్మెట్ స్ట్రాప్ లేదా క్లిప్ను సరిగ్గా బిగించుకోవడం అత్యంత ముఖ్యం. ప్రమాద సమయంలో క్లిప్ పెట్టుకోకపోతే హెల్మెట్ తల నుంచి జారిపోవచ్చు. దీంతో తలకు రక్షణ అందకపోయే ప్రమాదం ఉంటుంది. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి, క్లిప్ను తప్పనిసరిగా బిగించుకోవాలి.

హెల్మెట్ బరువు కాదు.. బాధ్యత

ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలకు భయపడి కాకుండా తమ ప్రాణాల రక్షణ కోసం హెల్మెట్ను ధరించాలి. ప్రతిసారి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలి. ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబాన్నే విషాదంలోకి నెట్టే అవకాశం ఉన్నందున వాహనదారులు భద్రత విషయంలో రాజీపడకూడదు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలి

కేవలం నిబంధనల అమలు కోసం కాకుండా తమ ప్రాణాల రక్షణ కోసం హెల్మెట్ పెట్టుకోవాలి. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నాణ్యమైన హెల్మెట్ వాడటంతో పాటు క్లిప్ను సరిగ్గా బిగించుకోవాలి. రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి అని ఎస్‌ఐ సూచించారు.

 ఐ శ్రీధర్ రెడ్డి

మరిన్ని వార్తలు