భారత్‌కు రికార్డు స్థాయిలో రెమిటెన్సులు

15-09-2026 | 09:08am

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు స్వదేశానికి పంపే రెమిటెన్సు(Remittance)ల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది భారత్‌కు 151 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు వచ్చినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఐఎఫ్ఏడీ నివేదిక వెల్లడించింది. 2016లో 63 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మొత్తం పదేళ్లలో రెండున్నర రెట్లు పెరిగింది. ఆధార్, యూపీఐ వంటి బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు ఈ వృద్ధికి దోహదపడ్డాయని ఐఎఫ్ఏడీ పేర్కొంది. కుటుంబాల అవసరాలు, ఆర్థిక వృద్ధికి రెమిటెన్సులు కీలకంగా మారాయని తెలిపింది. అయితే గల్ఫ్ దేశాలపై అధిక ఆధారపడటం అవకాశంతో పాటు సవాలు కూడా అని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు