పోలీస్ స్టేషన్ కు చేరిన లడ్డూ పంచాయతీ..!

15-09-2026 | 10:04am

కేసముద్రం, (విజయక్రాంతి): గణనాధుడి లడ్డు వేలంపాట డబ్బుల అంశం పోలీస్ స్టేషన్ కు చేరింది. కేసముద్రం పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో గత ఏడాది వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన గణనాథుడి మండలి వద్ద లడ్డూను వేలంపాటలో రూ.1,16,000 రూపాయలకు దక్కించుకున్న వ్యక్తి ఈ ఏడాది లడ్డు డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తమకు అతని వద్ద నుండి లడ్డు డబ్బులు ఇప్పించాలంటూ  నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. లడ్డు డబ్బుల గురించి పోలీసులను ఆశ్రయించిన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. కొందరు గొప్పలకు పోయి లడ్డును ఎక్కువ మొత్తానికి వేలం పాట పాడి, డబ్బులు చెల్లించకుండా ముఖం చాటేస్తున్న సంఘటనలు జిల్లాలో అనేకం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

మరిన్ని వార్తలు