నాగోబాకు మహబూబాబాద్ ఎమ్మెల్యే దంపతుల పూజలు

15-09-2026 | 10:43am

* ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికిన  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, సెప్టెంబర్ 15( విజయక్రాంతి ): అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్(Keslapur)లోని ఆదివాసుల ఆరాధ్య దేవుడు నాగోబాకు  మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, ఆయన సతీమణి మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఉమా నాయక్  ప్రత్యేక పూజలు చేశారు. అదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన వారు  రాత్రికి  కేస్లాపూర్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు లు స్వాగతం పలికారు. నాగోబాకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం  నాగోబా దేవుడి చరిత్రను  మహబూబాద్ ఎమ్మెల్యే  మురళి నాయక్ దంపతులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మెస్రం వంశస్థులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ దంపతులు మాట్లాడుతూ.. నాగోబాను  దర్శించుకోవాలని  ఎన్నో రోజుల కల నెరవేరిందని, నాగోబా ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని దేవుడిని కోరుకున్నానని  అన్నారు. ఆయనతోపాటు  కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు