ఈవీఎం గోదాంపై కలెక్టర్ ఫోకస్
ఆసిఫాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): ఈవీఎం గోదాం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను నెలవారీ తనిఖీల్లో భాగంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
గోదాం వద్ద ఏర్పాటు చేసిన సీల్స్, రిజిస్టర్లు, సీసీ కెమెరాల (CCTV Cameras) పనితీరును తనిఖీ చేశారు. భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని, సీసీ కెమెరాలు (Security Surveillance) నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు సాయి, శ్యాంలాల్, సీనియర్ అసిస్టెంట్ ముసాఫిర్ తదితరులు పాల్గొన్నారు.