ఆశ్రమ పాఠశాలలో కౌన్సిలర్ తనిఖీ

20-11-2026 | 02:46pm

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను 11వ వార్డు కౌన్సిలర్, డీసీసీ ఉపాధ్యక్షుడు రాజుర సత్యం శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రత (Cleanliness) పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచకపోతే విద్యార్థులు అనారోగ్యానికి (Health Problems) గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాఠశాల ఆవరణ, విద్యార్థుల వసతి గదుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

అనంతరం మధ్యాహ్న భోజనాన్ని (Mid-Day Meal) పరిశీలించారు. నిర్ణీత మెనూ (Food Menu) తప్పనిసరిగా అమలు చేస్తూ చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను కోరారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లాలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు