పుస్తకం మంచి స్నేహితుడి వంటిది: కలెక్టర్
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పుస్తకం మన వెంట ఉంటే మంచి స్నేహితుడు ఉన్నట్లేనని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. పుస్తక పఠనం (Book Reading) ద్వారా విజ్ఞానం, ఆలోచనా పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ అధ్యక్షతన నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల (National Library Week) ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా (Knowledge Centres) నిలుస్తున్నాయని, విద్యార్థులకే కాకుండా అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. గ్రంథాలయాలు స్ఫూర్తి కేంద్రాలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
గతంలో ఎంతోమంది నాయకులు, మేధావులు వివిధ అంశాలపై గ్రంథాలయాల్లో చర్చలు జరిపేవారని గుర్తుచేశారు. పుస్తకాల్లో జీవిత సత్యాలు దాగి ఉంటాయని, గ్రంథాలయం ద్వారా అపారమైన విజ్ఞానాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగులు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న వనరులను (Library Resources) సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగాలు సాధించాలని సూచించారు. అనంతరం వారోత్సవాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, డీపీఓ బిక్షపతి, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, నాయకులు అరిగెల నాగేశ్వరరావు, విశ్వప్రసాద్ రావు, బాలేష్ గౌడ్, జావిద్, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.