దుర్గాదేవికి 51 నైవేద్యాలు సమర్పించిన భక్తులు
మండపంలో వ్యాపారుల ప్రత్యేక పూజలు
బెజ్జూర్ అక్టోబర్ 21 (విజయక్రాంతి ) : బెజ్జూర్ మండల(Bejjur Mandal) కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ(Sri Ranganayaka Swamy Temple) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయం అర్చకులు గురుదత్ ఆధ్వర్యంలో చివరి రోజు దుర్గాదేవి మండపంలో భక్తులు(devotees) పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించి రకరకాల నైవేద్యాలు 51 సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.
శ్రీ రంగనాయక స్వామి ఆలయ అధ్యక్షుడు తంగేడి పల్లి మహేష్ దుర్గాదేవి శోభాయాత్ర వాహనాన్ని రంగురంగుల పువ్వులతో దుర్గాదేవి శోభ యాత్ర వాహనాన్ని సిద్ధం చేశారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేసి అనంతరం అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కొండ్ర జగ్గా గౌడ్, నాగభూషణ్ గౌడ్, భోగ రమేష్, సామల బాలాజీ, నరేందర్ గౌడ్, మిరియాల పెంటయ్య, మేరీ రంగయ్య, ఉపేంద్ర చారి, తంగిడిపల్లి నీలేష్ దంపతులు, తదితరులు పూజలు నిర్వహించారు.