ఘనంగా దుర్గా నిమజ్జనం

21-10-2026 | 06:56pm

లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 21: లక్షెట్టిపేట మండలంలో దుర్గాదేవి నిమజ్జనం(Durga Devi Immersion) అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దుర్గాభవాని కలశాలకు, చీరలకు వేలం పాట నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని భాజా భజంత్రీలు, డప్పు చప్పుల్ల మధ్య నిమజ్జనానికి తరలించారు. సమీప గోదావరి తీరంలో, గ్రామ చెరువులో అమ్మవారిని నిమజ్జనం చేశారు.

మరిన్ని వార్తలు