బతుకమ్మ తెప్పలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

21-10-2026 | 07:02pm

రుద్రంగి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నిర్మించిన నాలుగు బతుకమ్మ తెప్పల నిర్మాణం పూర్తి కాగా ఈ రోజు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Aadi Srinivas) ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 25 లక్షల రూపాయలతో నాలుగు బతుకమ్మ తెప్పలను నిర్మించడం జరిగిందన్నారు.

బతుకమ్మ ఆడే మహిళల కోరిక మేరకు బతుకమ్మ తెప్పల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రాంతీయ సాంస్క్రతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ, మహిళల అధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఈ తెప్పలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. బతుకమ్మ ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్న సర్పంచ్ మరియు పాలకవర్గన్ని అభినందించారు. రుద్రంగి ఒకే గ్రామానికి నాలుగు బతుకమ్మ తెప్పలు మంజూరు చేసినందుకు మహిళల తరపున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ధన్యవాదలు తెలిపారు.

మరిన్ని వార్తలు