జవహర్ నగర్ గడ్డ పేదల అడ్డ..
కాలుష్యంలో ప్రపంచంలోనే 4 వ, స్థానం: యు ఎల్ సి ఏ నివేదిక..
డంప్ యార్డ్ తరలింపే లక్ష్యంగా పాదయాత్ర..
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్..
జవహర్ నగర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): పేదలకు గరీబోళ్లకు అడ్డ ఈ జవహర్ నగర్ గడ్డయేనని కాలుష్య కాసారంగా ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఉన్నదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్(MP Eatala Rajender) పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలో నెలకొని ఉన్న డంపింగ్ యార్డ్ ను ఎత్తివేయాలని కోరుతూ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈనెల 27 నుండి పాదయాత్ర చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఉన్న గరీబోళ్ల జీవించే అడ్డ జవహర్ నగరమణి అటువంటి జవహర్ నగర్ నేడు డంపింగ్ యార్డు వలన హైదరాబాదులో నివసించే కోటి 20 లక్షల మంది ప్రజలకు 40 లక్షల మంది అతిధులకు హైదరాబాద్ చెత్త డంపింగ్ యార్డ్ వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వలన చుట్టుపక్కల ప్రాంతాలైన కీసర, దమ్మాయిగూడ, నాగారం, అహ్మద్‌గూడ, ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో జీవవైవిద్య సమస్యలు ఉత్పన్నమయ్యాయి పేర్కొన్నారు. ఈ డంపింగ్ యార్డ్ వలన పశుపక్షాదులు తదితర జీవుల ఉనికికే శ్రమాదకరమైందని తెలిపారు. భూగర్భ జలాలు కలుషితమైపోయాయని, జవహర్ నగర్ చుట్టుపక్కల ప్రజల జీవితం అగమ్య గోచరంగా తయారైందని తెలిపారు.
గత ఎంపీ గా పనిచేసిన రేవంత్ రెడ్డి ఈ సమస్య గురించి అప్పట్లో తీవ్రంగా ప్రతిఘటించాడని కానీ నేడు ముఖ్యమంత్రి అయ్యాక ఈ సమస్యను మరిచిపోవడం బాధాకరమన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల పరిసర ప్రాంతాలు గాలి నీరు వాయువులు కలుషితమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన బాధితులతో ఈ నెల 25వ తేదీన మేధావులతో డంపింగ్ యార్డ్ సమస్యలపై సమావేశం నిర్వహించి అనంతరం పాదయాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బిజెపి పార్టీ నాయకులు కలికోట కమలాకర్, జవహర్ నగర్ బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.