పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ
08-09-2026 | 07:43pm
మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనిత
కాగజ్ నగర్,(విజయక్రాంతి): మొక్కల పెంపకంతో పర్యావరణం పచ్చగా ఉండి, పర్యావరణం పరిరక్షించబడుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ కొత్తపల్లి అనిత(Municipal Vice Chairman Dr. Anita) అన్నారు. మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 29 వ వార్డు లో పర్యావరణ పరిరక్షణ- పట్టణ పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వార్డు ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో రోజురోజుకీ వాతావరణం వేడెక్కుతున్న ప్రస్తుత తరుణంలో మొక్కలు నాటాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని డాక్టర్ అనిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, మున్సిపల్ శాలరీ ఇన్స్పెక్టర్ శంకర్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.