పేదోడికి అండగా మంత్రి శ్రీధర్ బాబు

08-09-2026 | 08:06pm

బిట్టుపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్

మంథని,(విజయక్రాంతి): నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu), కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని మంథని మండల కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధ్యక్షులు ఐలి ప్రసాద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆశీస్సులతో మంథని మండలం బిట్టుపల్లి గ్రామానికి చెందిన మహేందర్–లావణ్య దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిలో సోమవారం నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాద్ హాజరై గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహేందర్–లావణ్య దంపతులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  ప్రసాద్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల్లో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మంథని(Manthani) ప్రాంత అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు తీసుకువస్తూ రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరూ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే క్యాంపు కార్యాలయంలో గానీ, తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు.

ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అండగా నిలవాలని కోరారు. రానున్న రోజుల్లో మంథని నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్యసాయం, రూ.2 లక్షల రుణమాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రజలకు ఆపద సమయంలో దుద్దిళ్ల సోదరులు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. నూతన గృహంలోకి అడుగుపెట్టిన మహేందర్–లావణ్య కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. సొంతింటి కల నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకుల కిరణ్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జి ఆరెల్లి కిరణ్, ఉప సర్పంచ్ రాయమల్లు, బిట్టుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పోగుల సాగర్, వేముల సతీష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు